Breaking News

హెలీప్యాడ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

మన ప్రగతి న్యూస్/రేగొండ :
రేగొండ మండలంలో
రామన్నగూడెం క్రాస్ రోడ్ వద్ద
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు.
ఈనెల 14న భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం రేగొండ మండలం రామన్నగూడెం క్రాస్ రోడ్డు వద్ద హెలీ ప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులను బుధవారం రాత్రి నుండే ప్రారంభించాలని సూచించారు. గురువారం రాత్రి వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అందుకు స్థానిక నాయకుల సహకారం తీసుకోవాలని అక్కడున్న అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆర్ అండ్ బీ డీఈ గౌస్ పాషా, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, రేగొండ ఎస్సై సందీప్ కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు..

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం