Breaking News

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేద కుటుంబాలలో చిగురుస్తున్న సొంత ఇంటి కల

ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదలైన సర్వే

మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఉమ్మడి కొత్తగూడ మండలం లో సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు శరవేగంగా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులను వడపోసిన అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా లోని కొత్తగూడ ,గంగారం మండలాల్లో బుధవారం నుండి ప్రత్యేక పాలన అధికారుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే జోరుగా కొనసాగుతోంది.