మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ఆరెగూడెంలో వివిధ కాలనీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ మోటకొండూరు మండల కార్యదర్శి కొల్లూరు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం నాయకులతో కలిసి బుధవారం రోజున ఆరెగూడెంలో ప్రతి కాలనీ తిరుగుతూ సమస్యలను గుర్తించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోలగాని జయరాములు,సిపిఎం నాయకులు పాల్గొన్నారు.