మన ప్రగతిన్యూస్ /తెలకపల్లి ప్రతినిధి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ ఆర్ శ్రీనివాసులు పిలుపు… ఈనెల 14 15 తేదీలలో అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న సిపిఎం మూడో మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులుపిలుపునిచ్చారు.బుధవారంతెలకపల్లి మండల కేంద్రంలో పార్టీ శాఖ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసిపిఎం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళ విద్యార్థులు అనేక వర్గాల ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసం పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి కార్మికులకు వ్యతిరేకమైన అనేక చట్టాలను రద్దు చేయించిన ఘనత సిపిఎం పార్టీకి దక్కిందని తెలిపారు. అలాంటి చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ జిల్లా మూడోమాసభలు ఈనెల 14 15 తేదీలలో అచ్చంపేటలోని ఘనంగా నిర్వహిస్తున్నామని 14 తారీకు నాడు వేలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ బివి రాఘవులు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. కామ్రేడ్ జాన్ వెస్లీ కామ్రేడ్ టీ సాగర్ తో పాటు జిల్లా ముఖ్య నాయకులు జిల్లా ముఖ్య నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. ప్రతినిధుల మహాసభ ఉంటుందని ఈ మహాసభలో 20 మండలాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున రెండు రోజులపాటు జరిగే జిల్లా మహాసభలను జిల్లా ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోపాసు లక్ష్మణ్. మండల కమిటీ సభ్యులు విజయ గౌడ్.హుస్సేన్. శివయ్య. అబ్బాస్. రాములు. తదితరులు పాల్గొన్నారు.