_ సీసీ కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలి..
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని,ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని తెలిపారు.నేరాల సంఖ్య తగ్గించుటకు, శాంతిభద్రతలను కాపాడుటలో,తమ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా గుర్తుతెలియని వ్యక్తులు తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి, ఇతర విషయాల్లో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగప డుతాయని అన్నారు.మండలం గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాల యందు సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు.. దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.చాలామంది ప్రజలు వాహనాలు నంబర్ ప్లేటు లేకుండా వాహనాలు నడుపుతున్నారని వాటిపై స్పెషల్ డ్రైవ్ చేస్తూ 120 మందిపై చలానా వేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం నుండి మైనర్ వాళ్లు వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే కఠిన చర్యలు.తీసుకుంటామని. తెలిపారు. వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.మైనర్ వాళ్లకి బండి. వెహికల్ తల్లిదండ్రులు గాని.వెహికల్ ఓనర్ గాని ఇచ్చిన మైనర్లు పట్టుబడిన. వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.. తల్లిదండ్రులు వారి పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వద్దని ప్రమాద బారి నుండి కాపాడుకోవచ్చు అని తెలిపారు…