Breaking News

వీరభద్ర స్వామి ఆలయ నూతన చైర్మన్ గా కొర్ను రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో

మహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద దేవాలయం కురవి మండలంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం ఆలయ మండపంలో అట్టహాసంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్.సమత నేతృత్వంలో జరిగింది. అందరు సభ్యుల ప్రతిజ్ఞ అనంతరం, సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఆలయ చైర్మన్ గా కోర్న రవీందర్ రెడ్డి నీ ఎన్నుకున్నారు.అనంతరం ఆలయ చైర్మన్ గా దేవస్థానం సన్నిధిలో గల చైర్మన్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ వేదా ఆశీర్వాదాలతో దేవస్థానం కార్య నిర్వాహణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన కొర్ను రవీందర్ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు,గ్రామ ప్రజలు, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్,చందు నాగన్న,నజీర్, ఇరుగు వెంకన్న,ఉపేందర్, కోర్ను కృష్ణారెడ్డి,నూకల మల్లయ్య దిలీప్,జనార్ధన్,మాజీ జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి,గుండ్రాతిమడుగు సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి,తదితరులు ఘనంగా సత్కరించారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి