నందికొండ రిసోర్స్ పర్సన్స్
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో శుక్రవారం నాడు పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్ ముందస్తుగా అరెస్టు చేసిన నాగార్జునసాగర్ పోలీసులు. శుక్రవారం నాడు హైదరాబాదులో నిర్వహిస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ల సమ్మె కారణంగా ముందస్తుగా నాగార్జున సాగర్ నందికొండ మునిసిపాలిటీ రిసోర్స్ పర్సన్ ను అరెస్టు చేయడం జరిగింది. అనంతరం రిసోర్స్ పర్సన్స్ (ఆర్.పి) మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుండి జీతాలు అందడం లేదని , చాలి చాలని జీతాలతో బతుకుతున్నామని రిసోర్స్ పర్సన్ కనీస వేతనం 18,000 చేయాలని , ఉద్యోగ బీమా , ఆరోగ్య బీమా ఇవ్వాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా పనిచేస్తున్న మాకు మాత్రం జీతాలు పెంచడం లేదని ఎలక్షన్ సర్వే , కుటుంబ సమగ్ర సర్వే , ప్రజాపాలన , స్వచ్ఛభారత్ లాంటి రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల వివిధ పథకాలలో ఇతర ఉద్యోగస్తుల తో పాటు మేము కూడా పనిచేస్తున్న మాకు మాత్రం చాలి చాలని జీతాలు అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .గత ప్రభుత్వం 2000 రూపాయలు పెంచి మొత్తం నెలకు 6000 రూపాయలు అందిస్తున్నారని, బి.ఆర్. ఎస్ ప్రభుత్వం మెప్మా ఆర్పిలకు గౌరవ వేతనం ఇవ్వడంలో విఫలమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు జీతాలు పెంచి మా బ్రతుకులు మార్చాలని ఆశిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ , మెప్మా ఆర్పిలు అనంతలక్ష్మి ,వరలక్ష్మి , రేణుక , రమణమ్మ , సింధు , లావణ్య , విశాలాక్షి , నాగమణి , హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.