మన ప్రగతి న్యూస్/ రేగొండ
రేగొండ మండలంలోని రామన్నగూడెం క్రాస్ వద్ద నిర్మించిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు భూపాలపల్లికి వస్తున్నందున వారు వచ్చే హెలికాప్టర్ దిగడానికి వీలుగా బీటీతో ఎలిప్యాడ్ నిర్మాణం చేశారు దీంతో శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అలాగే శనివారం బుద్ధారం నుండి కొడవటంచ వరకు 50 కోట్లతో నిర్మించే బిటి రోడ్డుకు బాగిర్తి పేట క్రాస్ వద్ద శిలాఫలకం ప్రారంభించి భూపాలపల్లి కి వెళ్లనున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య ,ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత ఎన్ఎస్ఆర్, జిల్లా నాయకులు మేకల బిక్షపతి, మాజీ ఎంపీటీసీ పట్టెం శంకర్, బీసీ సెల్ ఉమ్మడి మండల అధ్యక్షులు పొనుగోటి వీరబ్రహ్మం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మేకల రవికుమార్, సాబీర్, రేగొండ గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.