బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ కుమార్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు
మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటుచేసిన శిలాఫలకాలను కుట్ర పూరితంగా ధ్వంసం చేశారని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ విమర్శించారు. మండలంలోని కృష్టపురం గ్రామంలో అభివృద్ధి పనులకు ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడంతో శుక్రవారం కిష్టాపురం గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ చిన్న గ్రామాల అభివృద్ధికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోట్లాది రూపాయలు వెచ్చించారని తెలిపారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాల ధ్వంసంతో ప్రజలు అభివృద్ధి పనులను మరిచిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సొసైటీ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, జిల్లా నాయకులు జరుకపుల బాలు నాయక్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారుబోతుల వేణు, నాయకులు దొంతమల్ల గణేష్, మహేందర్ నాయక్, నాగరాజు నాయక్, వెంకటేష్ నాయక్, బోడ గోవర్ధన్ , సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.