మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన దేవసాని రామకృష్ణ ఇటీవల మృతి చెందగా శుక్రవారం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లపల్లి భవాని చంద్రశేఖర్ సహకారంతో 25 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ మాట్లాడుతూ దాతల సహకారంతో పేద కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జీడిహరీష్,
ప్రతినిధులు వర్రే కుమారస్వామి, రాపోలు రాము తదితరులు పాల్గొన్నారు.