Breaking News

భవిష్యత్తులో సాహూ మరిన్ని పదవులు చేపట్టాలని ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి

హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన శనిగరపు సాహు గత రెండు నెలల క్రితం జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా భారీ మెజార్టీతో గెలుపొందడంతో శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఆశీర్వదించినటువంటి పోన్నం ప్రభాకర్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆశీర్వదించారని తెలిపారు. అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజలు ఊహించని విధంగా అభివృద్ధి చేశారని, ప్రజా పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని అన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం