Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్ గ్రామానికి చెందిన మడిపడిగే యశ్వంత్ తండ్రి మడిపడిగే ఆంజనేయులు (18) అనే యువకుడిని అవుషాపూర్ విబిఐటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో యాష్ లోడుతో వెళ్తున్న లారీ యాక్టివ బైక్ నడుపుతున్న యశ్వంత్ ని ఢీకొట్టింది.దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతి చెందిన యువకుడు జమీలాపేట్ నుండి బీబీనగర్ వైపు వెళ్తుండగా వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.యువకుడు జన్మదినం రోజునే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం