Breaking News

గురుకుల పాఠశాల లో ఐదవ తరగతి ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ఐదవ తరగతిలో ప్రవేశానికి గురుకుల ఎంట్రెన్స్ పరీక్షను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.0 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు ఏన్కూర్ గురుకుల పాఠశాల సెంటర్లో 192 మంది విద్యార్థులకు గాను 187 మంది విద్యార్థులు హాజరయ్యారని, కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే గైర్హాజరయ్యారని. హాజరు శాతం బాగుందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష సజావుగా నిర్వహించామని విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్లతో పాటు అన్ని వసతులు కల్పించామని పాఠశాల ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం