Breaking News

అడవిలో మంటలు

-పట్టించుకోని అటవీశాఖ
-వన్యప్రాణులకు పొంచివున్న ముప్పు
మనప్రగతి న్యూస్/బయ్యారం


అడవి తల్లి కడుపులో అగ్గి రాజుకుంటోంది. అడవి చల్లగా ఉంటే ఊళ్లు పచ్చగా ఉంటాయి.వానలు కురుస్తాయి. ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. కానీ ఏదో ఒక కారణంతో వేసవి మొదలైందంటే రోజూ బయ్యారం పరిసరాలలోని అడవి అంటుకుంటోంది.ఆకతాయిల దుశ్చర్యనో లేక పొగత్రాగేవారి ఏమరపాటో కారణం ఏదైనా అటవీ అధికారులు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణమనే విమర్శలూ ఉన్నాయి. బలమైన గాలులకు చెట్ల మధ్య రాపిడి జరిగి నిప్పు రగిలి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్బాలూ ఉన్నాయి. కారణం ఏదైనా అడవులు మాత్రం కాలిబూడిదయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం


అడవిలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. వివిధ రకాల వృక్ష, తీగ, గడ్డి జాతుల మొక్కలు, చెట్ల విత్తనాలు తిరిగి మొలకెత్తే సహజ ప్రక్రియ ఆగిపోతుంది. అడవులు అగ్నికి ఆహుతి కావడం వల్ల ప్రకృతి సిద్ధమైన ఎరువు తయారుకాక అడవి పలుచబడుతుంది. శాఖహార జంతువులకు ఆహార కొరత ఏర్పడుతుంది.ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలిసినా నివారణ చర్యలు తీసుకోవడం లేదు.
వన్యప్రాణులకు పొంచివున్న ప్రమాదం :
వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో మంటలు అలుముకుంటే ఒక్కసారిగా అడవంతా దగ్దమయ్యేందుకు అవకాశం వుంటుంది.అడవిలో ఆవాసం వుండే వన్యప్రాణులకు అగ్నికీలలు, పొగతో ప్రమాదం పొంచివుంటుంది. అంతేకాకుండా వన్యప్రాణులు అడవులను వదిలి గ్రామాల వైపునకు మళ్లేందుకు అస్కారం ఏర్పడుతోంది. వీటితో పాటు అడవుల్లో భూమిని మేలు చేసే క్రిమికీటకాలు సైతం నాశనమై అడవుల అభివృద్దికి ఆటంకాలు ఏర్పడుతోంది.
బయ్యారం మండలం బాలాజీపేట, ఇర్సులాపురం,రామచంద్రాపురం, మొట్ల తిమ్మాపురం తదితర గ్రామాలను ఆనుకొని అడవులు విస్తరించి ఉన్నందున అడవులలోని అగ్ని కీలలు గ్రామాల్లో, తండాలో విస్తరించే పెను ప్రమాదం ఉంది.
*ప్రమాద సమయంలో ఆలస్యంగా ఫైర్ ఇంజన్లు
ఈ నేపథ్యంలో బయ్యారం మండలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న తరుణంలో మండలంలో అగ్ని మాపక కేంద్రం లేకపోవడం తీవ్ర నష్టానికి తావిస్తుంది.అగ్ని ప్రమాదం జరిగితే ఇల్లందు నుండి గానీ మహబూబాబాద్ నుండి గాని దాదాపు 30 నుండి 40 కిలోమీటర్లు ప్రయాణ సమయానికే క్లిష్ట సమయం వృధా అవుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజా ప్రతినిధులు,అధికారులు మండల కేంద్రంలో కనీసం ఒక అగ్నిమాపక యంత్రాన్ని ఉంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.