మనప్రగతిన్యూస్/ చిట్యాల
చిట్యాల మండలంలోని లక్ష్మీపురం తండా గ్రామంలో గురువారం రోజున బాల్య వివాహం జరుగుతుందని సమాచారంతో చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పెళ్లిని ఆపడం జరిగింది.ఆ మైనర్ అమ్మాయిని మరియు వారి యొక్క తల్లితండ్రులను చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది కౌన్సిలింగ్ గురించి భూపాలపల్లి ఆఫీస్ కు తీసుకు వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ లింగన్న నాగరాజు పాల్గొన్నారు.