Breaking News

దోమల నివారణకు డ్రోన్ యంత్రం సహాయంతో పిచికారి

మన ప్రగతి న్యూస్ / కాప్రా

నాచారం పటేల్ కుంట చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క వల్ల తీవ్రమైన దోమల సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమల నివారణ కోసం శుక్రవారం కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ఆధ్వర్యంలో ఎంటమాలజీ విభాగము అధికారులు పటేల్ కుంట చెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల నివారణ రసాయనాలను పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా గుర్రపుడెక్క తొలగించే పనులను అధికారులు చేపట్టాలని కోరడమైనది. చెరువుకు ఆనుకుని ఉన్న మసీదు లో రంజాన్ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి దోమలు సమస్య లేకుండా చూడాలని అధికారులకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏ.ఈ రమేష్ సూపర్వైజర్ నర్సింగ్ రావు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జన్ శేకర్ జియా సంతోష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం