Breaking News

TPUS బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో అహిల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాలు

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ:

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో లోకమాత , ధీరవనిత అహిల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది (1725-2025) ఉత్సవాలను పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశం, అతిథి గిరిజా గాయత్రి మాట్లాడుతూ.. వీర వనిత, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చిన్న వయసులోనే ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వనిత, ఔరంగజేబు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాలను పున నిర్మించిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆహిల్యా బాయి హోల్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన మహిళలను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, తపస్ మహిళా జిల్లా కన్వీనర్ ఉమాదేవి, సంధ్య రాణి , జిల్లా ఉపాధ్యక్షులు వేద ప్రకాష్ తపస్ మండల అధ్యక్షులు నరసింహ చారి, శ్రీకాంత్ రెడ్డి ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం