మన ప్రగతి/ వికారాబాద్ ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై వెంకటరవణ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓలు, యూనియన్ కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ హెల్త్ ఎడ్యుకేటర్స్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలోని గెజిటెడ్ అధికారులు , హెల్త్ ఎడ్యుకేటర్లు, సిబ్బంది అందరూ కూడా వారి విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి వైద్య ఆరోగ్యశాఖకు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓలు డాక్టర్ జీవరాజ్, డాక్టర్ రవీంద్ర యాదవ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ. చంద్ర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసులు,డిప్యూటీ డెమో చండీశ్వరి, డిపిహెచ్ఎన్ఓ, ఆఫీస్ సూపరిండెంట్ నర్సింహులు, హెల్త్ ఎడ్యుకేటర్లు రేణు కుమార్, రజిత, రాజేశ్వరి, శాంత, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
