మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో బస్టాండ్ సమీపంలో గల అంగన్వాడి కేంద్రం లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం సమయం 11 గంటలు అయినప్పటికీ అంగన్వాడీ కేంద్రానికి టీచర్ రాకపోవడంతో స్థానికులు మండిపడ్డారు. పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కిందిస్థాయి ఉద్యోగస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఉద్యోగస్తులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.