మన ప్రగతి న్యూస్/హత్నూర:
ఈనెల 18 19 న ఢిల్లీలో జరిగే జాతీయ మహిళా సదస్సును విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో బీసీ సంఘం మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ అన్నారు. బుధవారం మహిళా సదస్సు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బీసీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు సబ్ కోట రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించాలని దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. మహిళా సదస్సు దేశంలోని 18 రాష్ట్రాల మహిళలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు మహిళా ఎంపీలు విద్యావేత్తలు మేధావులు హాజరవుతారని అందుకు బీసీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ఉపాధ్యక్షులు బట్టు మారుతి రాజు, మధు, సతీష్, రామాచారి, లింగం, రాజు, దుర్గేష్,సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.