Breaking News

లేడీ అఘోరీకి బ్రేకులు వేసిన సిరిసిల్ల జిల్లా పోలీసులు

_ సిరిసిల్ల సరిహద్దుల్లో భారీ బందోబస్తుతో కట్టడి చేసిన పోలీసులు..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్

తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్న అఘోరీ రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు అయిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామం వద్ద మరోసారి ప్రత్యక్షమైంది. అఘోరీ వేములవాడకు వస్తున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు సిద్దిపేట నుండి సిరిసిల్ల వచ్చే రహదారి మధ్యలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అఘోరీ సిద్దిపేట- సిరిసిల్ల మార్గంలోని జిల్లెల్ల వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

సుమారు 50 మంది పోలీసులు సరిహద్దు జిల్లెల్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడం పట్ల అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.