ఆలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు
మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం శుక్రవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వార్లను చక్కగా అలంకరణ చేసిన పూజారులు సతీష్ కుమార్ శర్మ, మణిశర్మ, సూర్య కుమార్ శర్మ పండితులు వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అశోక కుమారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిపించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, జంటలు దాదాపు 200కు పైగా పాల్గొని కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. తాళ్ల వెంకటేశ్వర్లు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కళ్యాణానికి పాల్గొన్న ప్రతి ఒక్క జంటకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. కళ్యాణం లో పాల్గొన్న జంటలకు శాలువాలతో సన్మానించారు కళ్యాణ మహోత్సవంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని కళ్యాణాన్ని చాలా చక్కగా జరిపించారు

.