Breaking News

10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్

_ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. ఈ మండలంలో రెండు సెంటర్లలో మొత్తం 534 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయబోవుచున్నారు 302 మంది బాలికలు 232 మంది బాలురు పరీక్షలు రాస్తున్నారు, సిబ్బంది రెండు కేంద్రాలలో ఇద్దరు సిఎస్లు ఇద్దరు డి వో లు రవీందర్, మురళీధర్ రావు లు మొత్తం 29 మంది ఇన్విజిలేటరలుగా విధులు నిర్వహించబోతున్నారు, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ విద్యుత్ సౌకర్యం వాటర్ సదుపాయం అన్ని కల్పించడం జరిగిందని తెలిపారు .కావున విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఒత్తిడికి లోను కాకుండా చక్కగా పరీక్ష వ్రాయలని సూచించారు..