మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ఎస్బిఐ లో సేవలందిస్తు బదిలీ పై పూసుగూడెం ఎస్బిఐ బ్యాంకుకు వెళ్లిన ఎస్బిఐ మేనేజర్ బి రాజేంద్రనాయక్. ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ఉత్తమ బ్యాంకింగ్ తో పాటు ఎక్స్టెంట్ పర్ఫార్మెన్స్ కు గాను హైదరాబాద్ ఎస్బిఐ సిజిఎం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ములకలపల్లి శాఖలో చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం పరిచారు.