Breaking News

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి

మనప్రగతి న్యూస్/చిట్యాల

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయినట్లు
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.