మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఏన్కూరు మండల కేంద్రం నుండి టీ.యల్.పేట గ్రామం సమీపంలోని గుడ్ న్యూస్ స్కూల్ ఎదురుగా రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడం, అడుగు లోతు గుంతలు, ఎత్తు పల్లాల వల్ల వాహనాలు అదుపు తప్పడం వంటివి ఈ మార్గంలో ప్రయాణించే వారి ప్రాణాలకు సంకటంగా పరిణమిస్తున్నాయి. గతంలో జరిగిన ప్రమాదాలు. ఈ మార్గం నుంచి రోజు వేల కొద్ది వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి .

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులు వెంటనే ఈ రోడ్డు మరమ్మతులను చేపట్టాల్సిన అవసరం ఉంది. రోడ్డును సమతలం చేయడం, గుంతలను పూడ్చడం, కంకర స్థానంలో తారు వేయడం వంటి పనులు త్వరితగతిన చేపడితే ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే, రాత్రి వేళల్లో గుంతలు కనిపించేలా రోడ్డు పక్కన రిఫ్లెక్టర్లు లేదా లైటింగ్ ఏర్పాటు చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. స్థానిక ప్రజలు మరియు వాహనదారుల భద్రత కోసం ఈ సమస్యను పరిష్కరించడం అత్యవసరం.