మనప్రగతి న్యూస్ /మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -3 రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి అన్నారు.
గురువారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరేట్ తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన టిజిపిఎస్పి గ్రూప్ -3 రాత పరీక్ష పై సమీక్షా సమావేశానికి డిఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ ఛీఫ్ సూపరింటెండెంట్లు, ప్లైయింగ్ స్వాడ్స్,రూట్ ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వారి వారికి కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ, ఏలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక అంశము నియమ నిబంధనల ప్రకారం చేయాలని, మీకు కేటాయించినంత వరకు మాత్రమే మీరు మీ విధులను నిర్వహించాలని అదనపు కలెక్టరు సూచించారు. ఛీఫ్ సూపరింటెడెంట్లు పరీక్షా కేంద్రాలను పరిశీలించి అవసరమైన మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ గ్రుప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలను సూచించారు. భద్రత పోలీసు శాఖ వారితో, నిరంతరాయ విద్యుత్తు, త్రాగునీరు, అదనపు బస్సులు సంబంధిత శాఖల అధికారులతో కో ఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ఒకరోజు ముందుగానే మీకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను పరీశీలించుకోవాలన్నారు. పరీక్షా సెంటర్లలోరూట్ మ్యాప్ లు, సైన్ బోర్డ్స్, సీటింగ్ అరేంజ్ మెంట్ వంటి వాటిని సరిగా ఉన్నాయా అని పరిశీలించాలి.ఈ పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న అధికారులందరి మోబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేసారు. సంబంధిత అధికారులు వారి నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ -3 పరీక్షలకు ప్లైయింగ్ స్వాడ్స్,రూట్ ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నజిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.