Breaking News

ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న హిల్ కాలనీ, పైలాన్ కాలనీ పట్టణం నందు
భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించుకుని బాలల దినోత్సవాన్ని గురువారం రెండు కాలనీల యందు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహచారు. ఈ సందర్భంగా హిల్ కాలనీ న్యూ కిడ్స్ పబ్లిక్ స్కూల్లో చాచా నెహ్రూ వేషధారణతో ఉన్న విద్యార్థికి కేక్ కట్ చేయించి విద్యార్థులకు మిఠాయిలు పంచారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, నాగమణి, హసీనా, మల్లికా, నిహారిక, స్నేహలత, హుస్సేన్ బి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం