Breaking News

పాఠశాలల్లో ఘనంగా బాలుల దినోత్సవం వేడుకలు

శ్రీ చైతన్య పాఠశాలలో పిల్లలు పలు వేశాదారణలో ఆకట్టుకున్నారు.

చిన్నతనం నుండే పిల్లలకు విద్య బుద్ధి క్రీడా వికాసం కొరకు కార్యక్రమాలు చేస్తున్న పలు పాఠశాలల నిర్వాహకులు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా:

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజులు ఘనంగా నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదని విద్య నేర్పిన గురువులను గౌరవించడం, కన్న తల్లిదండ్రులను గౌరవించడం, ప్రతి పాఠశాల నిర్వాహకులు ప్రధాన అంశంగా పెట్టుకుని నేర్పించాలని, పిల్లలు క్రమశిక్షణతో ప్రపంచంలోనే గొప్ప ఆయుధం అయినటువంటి చదువును పూర్తిచేసి ఉన్నత పదవులు అధిరోహించాలని, అదేవిధంగా దేశభక్తి, దైవభక్తి, పాటలు, ఆటలు,చిత్రలేఖనం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యలో భాగమని అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోనుకు దూరంగా ఉండి పుస్తకానికి దగ్గర అవ్వాలని కోరారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో గురువులది కీలక పాత్రని, ఇంటిదగ్గర బాల్యం నుండి పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి సంస్కారం నేర్పించవలసిన బాధ్యతని, ఇంటిదగ్గర తల్లిదండ్రులు విద్యార్థులకు చదువు మీద, సంస్కారం మీద, దృష్టి పెట్టే విధంగా చూడవలసిన బాధ్యత గురువులో సగభాగమైన తల్లి,తండ్రిల మీద ఉంటుందని అందరూ గమనించాలని అన్నారు.

ఈ వేడుకలలో పాఠశాలల్లో ఉన్న పలువురు విద్యార్థులు దేశ నాయకులు అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీరాణి, భరతమాత,శకుంతల దేవి, తదితర వేషధారణలో విద్యార్థుల ఆకర్షణీయంగా అలరించి విద్యార్థులకు క్రీడ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.