మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్
హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఓ మహిళకు తీవ్రంగా గాయాల పాలయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం గ్రామానికి చెందిన గంగాధరి వనమ్మ అనే మహిళ తన పొలంలో పనులు చేస్తుండగా ఎలుగుబంటి ఒకసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన స్థానికులు వెంటనే మహిళను హాస్పిటలకు తరలించారు. గ్రామస్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గ్రామస్తులు ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.