రైతుల పొలాలను ఖరాబు చేస్తూ వృత్తిదారులను ఇబ్బంది పెడుతున్న మైనింగ్ లీజు దారుల లీజును రద్దు చేయాలి
– సిపిఎం నాయకులు గ్రామ ప్రజల డిమాండ్
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి
యాదాద్రి భువనగిరి ప్రతినిధి భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 130 లోని సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మట్టెనగుట్టను కొల్లగొట్టడానికి అక్రమ దారులకు ఇచ్చిన లీజును వెంటనే రద్దు చేయాలని,అక్రమంగా మట్టిని అమ్ముతున్న వారిపై చర్య తీసుకోవాలని,గుట్టను తొవ్వుతూ వరిచేలను కరాబు చేస్తూ,వృత్తిదారులను,ప్రజలను ఇబ్బంది పెడుతున్న లీజు దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.గురువారం సిపిఎం,వృత్తి సంఘాలు,గ్రామ రైతులు,ప్రజల ఆధ్వర్యంలో అక్రమంగా తవ్వుతున్న గుట్టను పరిశీలించి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టూరా పచ్చటి పొలాల మధ్యన గ్రామ ప్రజలందరికీ వృత్తిదారులకు,రైతులకు తమ గొర్రెల,మేకలను,అవులను,బర్రెలను,గేదెలను మేపుకోని వాటి ద్వారా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఉపయోగపడుతున్న గుట్టను అక్రమ దారులకు ఏ విధంగా లీజుకి ఇస్తారని వారు ప్రశ్నించారు.సంవత్సరాల నుండి పచ్చి మేతను అందిస్తున్న ఈ గుట్టలను గ్రామ ప్రజలకు తెలవకుండా కొంతమంది తమ తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులతో కుమ్మక్కై ఎట్లా లీజుకి ఇచ్చారని అన్నారు.సహజంగా ఏర్పడ్డ ప్రకృతి సంపదను నాశనం చేసి చెట్లను నరికి,మట్టిని తవ్వి,గుట్టల అవశేషాలను మాయం చేసే ప్రయత్నాలను గ్రామ ప్రజలు,రైతులు వృత్తిదారులు ఐక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలకు తెలియకుండా జిల్లా పర్యావరణ శాఖ,మైనింగ్ శాఖ,రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతం గురించి తెలవని పెట్టుబడిదారులకు అనుకూలంగా తీర్మానాలు చేసి ఎట్లా లీజుకి ఇచ్చారని ప్రశ్నించారు.గుట్టలను మైనింగ్ కోసం లీజుకు ఇవ్వడం వల్ల పరిశ్రమ నుండి వెదజల్లే దుమ్ము,ధూళితో పంట పొలాలు నిండి నాశనం అవుతాయని అన్నారు.దాంతోపాటు గొర్రెలు,మేకలు,పాడి పశువులు శ్వాస జీర్ణకోశ వ్యాధులతో గర్భస్రావాలతో అనేక రోగాల బారిన పడి మరణిస్తాయని అవుతోందని వెలిబుచ్చారు.ప్రజలు కూడా అనేకమైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం జరుగే ప్రమాదం ఉందని ఆవేదన వెలిబుచ్చారు.క్వారీ పేరుతో లీజుకు తీసుకొని దొంగ సాటుగా మట్టిని ఎట్లా అమ్ముకుంటారని వారు ప్రశ్నించారు.చుట్టుపక్కల ఉన్న రైతులు మట్టిని తీయవద్దు అని అంటే దాడి చేయడానికి లీజు దారులు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ గుట్టను గతంలో భూమిలేని నిరుపేద ముస్లింలకు మూడు ఎకరాలు ఇచ్చారని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు అక్రమంగా మైనింగ్ కోసమిచ్చిన లీజున రద్దు చేయాలని వెంటనే అక్రమంగా తవ్వుతున్న లీజుదారులు ఈ ప్రాంతాన్ని కాలిచేసి వెళ్లిపోవాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నెలికంటి జంగయ్య,గ్రామ రైతులు,వృత్తిదారులు ప్రజలు కోట భూపాల్ రెడ్డి,బోయపెళ్లి పురుషోత్తం రెడ్డి,సుక్క శంకరయ్య,సుక్క ఇస్తారి,సుక్క అచ్చయ్య,సామల నర్సిరెడ్డి,కోట జనార్దన్ రెడ్డి,సుక్క ముత్తయ్య,కోట చిన్న భూపాల్ రెడ్డి,మంటిపల్లి ఐలయ్య,కొత్త యాదయ్య,మంటిపల్లి రాములు,కే ఐల్ రెడ్డి,మేకల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.