మన ప్రగతి న్యూస్/మెదక్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మరియు మనోహరాబాద్ మండలాల్లో 10 కిలోల గంజాయి కేసులు చేదించిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ కి గురువారం ఉదయం మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రివార్డ్ అందజేశారు. అంతే కాకుండా తూప్రాన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగ కృష్ణ మానవీయ కోణంలో స్పందించి చెడు మార్గంలో పయనిస్తున్న యువతను సన్మార్గంలో నడిపించడానికి కంకణ బద్దులై డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆనతి కాలంలోనే ఏకంగా రెండు గంజాయి కేసులు ఛేదించి తనదైన శైలిలో నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఒకటి తూప్రాన్ లోని లక్ష్మి నరసింహ వెంచర్ లొ మరోటి జీదిపల్లి లో ఛేదించి ప్రజలనుంచి మన్ననలను అందుకోగా జిల్లా పోలీస్ బాస్ అయిన ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రివార్డ్ అందుకోవడం మరో విశేషం. ఇటీవల చిత్తు బొట్టు ఆట కట్టించిన సి ఐ రంగ కృష్ణ శభాష్ పల్లి లోని ఓ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని ఈ ప్రాంతంలో విచ్చల విడిగా ఆడుతున్న జూదగాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించారు. ఏది ఏమైనా పోలీస్ శాఖలో నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టేలా వారి భరతం పట్టేందుకు ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండడంతో తూప్రాన్ పోలీస్ సర్కిల్ నెర రహిత ప్రాంతంగా ఉండనుంది. అలాగే మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, ఐడి పార్టీ స్టాప్ నర్సింలు, సత్యం ముకుందం, శ్రీనివాసరాథోడ్, ప్రశాంత్ రాజులకు గంజాయి కేసు చేదించినందుకు గాను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందలు తెలియజేస్తూ రివార్డ్ అందుకున్నారు.