Breaking News

మూగజీవుల సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

మూగజీవులు అంతరించిపోకుండా ఉండాలని సేవా సంఘం నిర్మించిన మూగజీవుల ప్రేమికులు

మూగజీవులను ఆదుకోవడమే కాకుండా నిరాశ్రయులు ఉన్న వారికి సాయం అందించి సహకారం అందిస్తామంటున్న సంఘ సభ్యులు

మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల జిల్లా:

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

మంచిర్యాల జిల్లా పట్టణ ప్రాంతంలో మూగజీవుల సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.సంఘ సభ్యులు మాట్లాడుతూ తుంగ ప్రీతం, శరణ్య దంపతుల కూతురు త్రక్షరి,పుట్టిన రోజు సందర్భంగా ఏకలవ్య ఆశ్రమంలో 40 మంది పిల్లలకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ సభ్యుల్లో ఒకరైనటువంటి దూట రాజసమ్మయ్య విశ్వహిందూ పరిషత్ జిల్లా గోరక్ష ప్రముఖ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వారి కూతురి హర్షిక పుట్టిన రోజు సందర్భంగా సాయి దృష్టి అందుల పాఠశాల వృద్ధాశ్రమం లో 20 మంది నిరాశ్రయులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదేవిధంగా జిల్లాలో పట్టణ ప్రాంత గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కొంతమంది శుభకార్యాల సందర్భంగా వృధా ఖర్చు చేస్తున్నారని అలా చేయకుండా ఆకలితో అలమటిస్తున్న వారికి నిరాశ్రయులు ఉన్నవారికి ఉన్నంతలో సహాయం అందించి వారి మన్ననలను పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మూగజీవుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కటుకం నాగరాజు, ఉపాధ్యక్షుడు మర్రి స్వామి, కోశాధికారి తిరుమల శెట్టి రమణ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేముల హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ సంగెం శ్రీధర్, గోపాలమిత్ర పానుగంటి శ్రీనివాస్ సలహాదారు కంచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది.