Breaking News

వారసత్వ భూమిపై హక్కు కల్పించాలని కోరుతూ మహిళల నిరసన

మన ప్రగతి న్యూస్/తుంగతుర్తి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తండ్రి వారసత్వ భూమిపై బిడ్డలకు హక్కు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు నిరసన చేసిన సంఘటన శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది.
సంగేమ్ గ్రామానికి చెందిన అన్నపర్తి ముత్తయ్య కు ఊరు చివరలో సర్వేనెంబర్ 29, 30 ఇ /రూ లలో సుమారు 1.22 ఎకరాల పట్టా భూమి ఉన్నది. ఇతనికి ఇద్దరూ భార్యలు. మొదటి భార్యకు అయిదుగురు సంతానం అనంతరం భార్య మృతి చెందినముతో రెండవ భార్య అనపర్తి నాగమ్మకు ఇరువురు కుమార్తెలు కలరు. నాగమ్మ కుమార్తెల పెళ్లి కూడా మొదటి భార్య 5 గురు అక్కలు కలిసి వీరి వివాహం చేసినారు. రెండు నెలల క్రితం ముత్తయ్య తన భూమిని ఎవరికి చెప్పకుండా మరొకరికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించాడు. తుంగతుర్తి తాసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయకముందే మొదటి భార్య ఐదుగురు బిడ్డలు కలిసి సార్ రిజిస్ట్రేషన్ చేయొద్దని తాసిల్దార్ వినతి పత్రం అందజేశారు. దీనికి తోడు బిడ్డలు భూమిపై కోర్టులో కేసు కూడా వేయించారు. అయినప్పటికీ తాసిల్దార్ దయానంద్ నియంత పోకడతో ఆ భూమిని బానోతు భూమిక పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. తండ్రి ముత్తయ్య వారసత్వ భూమిపై తమకు హక్కు కల్పించాలని కోరుతూ మహిళలు జిల్లా కలెక్టర్ వేడుకుంటూ జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని ముత్తయ్య కుమార్తెలైన వడకల లక్ష్మీ, సైదమ్మ, మరియమ్మ, మల్లమ్మ, నాగమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.