Breaking News

దళారులను నమ్మొద్దు-ప్రతి గింజను కొంటాం..—- ఎమ్మెల్యే మురళి నాయక్.

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

దళారులను నమ్మి మోసపోవద్దని, రైతుల పండించిన ప్రతి వడ్ల గింజను కొంటామని ఎమ్మెల్యే డా.మురళి నాయక్ అన్నారు.. ఇనుగుర్తి మండలంలోని రాము తండా లో పిఎసిఎస్ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు,ఎమ్మెల్యేలు సన్నబియ్యం తింటూ ఉంటే పేదలేమో దొడ్డు బియ్యం తినడం ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించి చౌక ధరల దుకాణాల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో కాకుండా కర్షకులు వడ్లు తేగానే కొనుగోలు కేంద్ర నిర్వాహకులు క్రమపద్ధతిలో పేర్లు రాసుకుని కాటాలు పెడుతున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఎమ్మెల్యే నిర్వాహకులకు సూచించారు. కాగా ఇనుగుర్తి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని కోరుతూ పార్టీ మండల కార్యదర్శి బైరు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్, కేసముద్రం ఏఎంసి డైరెక్టర్లు కొట్టం రాము,శ్రీను,నంద, సీఈఓ వెంకటాచలం ఏవో మహేందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కూరెల్లి సతీష్,లోకేష్,మీటు,బైరు అశోక్ గౌడ్, రాజేందర్ రెడ్డి,కట్టయ్య యాదవ్, వల్లముల మురళి,యాకాంతం,శ్రీనివాస్, జనార్ధ న్, సూర్య నాయక్ హరికృష్ణ,సీతారాం,రమేష్,వీరన్న
తదితరులు పాల్గొన్నారు.