
ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మార్వో
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మన ప్రగతి కథనానికి స్పందించి
మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను స్థానిక ఎమ్మార్వో ముప్పు కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆధార్ సెంటర్ ను మండల ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ ఆపరేటర్ అడ్డగట్ల రాజు, ఆర్ ఐ, మరియు ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది , దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, పరికి రత్నం, తదితరులు పాల్గొన్నారు. మన ప్రగతి కథనానికి స్పందించి ఆధార్ సెంటర్ ను ప్రారంభించడానికి కృషిచేసిన మన ప్రగతి పత్రికకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.