Breaking News

బాన్సువాడ లో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో కోనాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో బుధవారం మండల వ్యవసాయ అధికారి షోయాజుల్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి సీజన్ కు సంబంధించి ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం 100% సబ్సిడీ పై శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షయాజుల్ల, వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీటీసీ హనుమాన్లు పటేల్, తిరుపతిరావు, సాయిబాబా, రైతులు పాల్గొన్నారు.