మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జునసాగర్ నందికొండ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ నందు నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లాస్థాయి అండర్ 14 ,అండర్ 17 నెట్ బాల్ సెలక్షన్స్ విజయవంతంగా ముగిశాయి, నెట్ బాల్ సెలక్షన్స్ కు నల్లగొండ జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ విమల, మిర్యాలగూడ డివిజన్ సెక్రెటరీ వెంకట్రామిరెడ్డి, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ హెచ్ఎం సిస్టర్ లలిత ముఖ్య అతిథులుగా హాజరు అయ్యి సెలక్షన్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు, నల్లగొండ జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్స్ కు వివిధ పాఠశాలల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరవ్వగా అండర్ 14 విభాగంలో 12 మంది బాలురు 12 మంది బాలికలు , అండర్ 17 విభాగంలో 12 మంది బాలురు 12 మంది బాలికలు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని ఎంపికైన క్రీడాకారులు ఈనెల 23 ,24 ,25 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు వెళ్ళనున్నారని నల్గొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సిస్టర్ క్లారా, పిఈటి కిరణ్ కుమార్ వివిధ పాఠశాలల పిఈటిలు విద్యార్థులు పాల్గొన్నారు.