మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
నాగార్జున సాగర్ లోని నీటి మట్టం రోజు రోజు కు తగ్గుముఖం పడుతుంది,ఎగువ నుంచి రిజర్వాయర్ కు స్వల్ప ఇన్ ఫ్లో ఉండటం వలన కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయటం వలన రిజర్వాయర్ లోని నీటి మట్టం తగ్గు ముఖం పడుతుంది.దీని గరిష్ట నీటిమట్టం 590 అడుగులకు ఉండాల్సిన ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం బుధవారం 584.65 అడుగులుగా ఉన్నది,నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీల కు 296.2810 టీఎంసీలుగా ఉన్నది.కుడి కాల్వ ద్వారా 7381 క్యూసెక్కులు ఎడుమ కాల్వ ద్వారా 5367 క్యూసెక్కులు , ఎస్ ఎల్ బీసీ,ఏఎంఆర్పి ద్వారా 2400 క్యూసెక్కులలో వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో గా 15448 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉండగా అంతే మొత్తాన్ని అవుట్ ఫ్లో గా విడుదల చేస్తున్నారు.ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.