Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేస్తా.. అభివృద్ధి చేసి చూపిస్తా

_ రుణమాఫీ ఫై అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ సిద్ధమా..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల /వేములవాడ/ప్రతినిధి

-కేసిఆర్ 20 వేల కోట్లు ఖర్చుపెట్టిండు.. ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు..
-పది నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం..
-నా నియోజకవర్గం కోడంగల్ పై ఎందుకు కక్ష కట్టిండ్రు..
-ఎక్కడికి వెళ్లినా కుట్ర చేసిన కేటిఆర్ పై చర్యలు తప్పవు..

మొదటి ఐదు సంవత్సరాలలో ఎంత రుణమాఫీ చేశారు, రెండోసారి అధికారం వచ్చినంక ఎంత రుణమాఫీ చేశారో లెక్కలు తీద్దాం.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం 11 వేల కోట్ల రుణ మాఫీ 5 సంవత్సరాల చేస్తే , కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 18 వేల కోట్ల మాఫీ చేశాం,గత ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీ, నేడు జరుగుతున్న రుణమాఫీ పై చర్చ పెడ్తాం, ధైర్యం,చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా స్వామి అని కేసిఆర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్డు వెడల్పు, యార్ని డిపో ప్రారంభోత్సవం, మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కి భూమి పూజ , రుద్రంగిలో ఏటిసి సెంటర్ పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ
రాజన్న ఆలయం అభివృద్ధి, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం స్వీకారం చుట్టిందనిఅన్నారు.ఆనాడు పిసిసి చీఫ్ గా పాదయాత్ర నిర్వహించానని గడీలను కూల్చే వరకు ఈ పాదయాత్ర ఆగదని, ఆనాడు రాజన్నను దర్శించుకున్నానని, ఆనాడే చెప్పిన రాజన్నను మోసం చేసిన కెసిఆర్ ను గద్దె దించాలని, అన్నట్టుగానే గద్దె దించినామని అన్నారు. ఆనాడు చెప్పిన ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్న ఆలయ అభివృద్ధి ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చినా ఆ మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నానని అన్నారు. పాదయాత్రలో కలికోట ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత అని చెప్పిన, ఆ ప్రాజెక్టును పూర్తిగా చేసే బాధ్యత అని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు లే ఉన్నాయని, గత పది సంవత్సరాలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలేదని, ఆనాడు పూర్తికాని ప్రాజెక్టులను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తున్నదని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు నైన్ పనులు పూర్తి చేయడానికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమీక్ష చేస్తున్నారని, జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడని అన్నారు. ఈనెల నవంబర్ 30న జిల్లా ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తాడని, ఎన్ని నిధులు కావాలో, ఎప్పుడు పూర్తి చేస్తారో మంత్రి కుమార్ చెబుతాడని అన్నారు. ఉద్యమాలకు కేరాఫ్ కరీంనగర్ జిల్లా నని పీవీ నరసింహారావు, చుక్కారావ్, సత్యనారాయణరావు లాంటి మంచి నాయకత్వం గల నాయకులు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారని అన్నారు. మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,
2004లో కరీంనగర్ గడ్డమీద నుండి సోనియా గాంధీ మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం, పార్టీ నష్టపోయిన తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడానికి, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి అప్పటి కరీంనగర్ ఎంపీ ప్రభాకర్ ఎంతో కీలక పాత్ర పోషించాడు అని అన్నారు. రెండుసార్లుగా ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్కు చిల్లి గవ్వ తేలేదని, కేంద్ర మంత్రి అయినా నరేంద్ర మోడీ నుంచి నయా పైసా తీసుకురాలేదని అన్నారు. మూడుసార్లుగా ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్కు చేసింది గుండు సున్నా అని అన్నారు. Bi ఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో 20,000 కోట్లు ఖర్చు పెట్టాడని, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, కాలేశ్వరం నైన్త్ ప్యాకేజ్ ఎందుకు చేయలేరు, రాజన్న ఆలయం అభివృద్ధి ఏమైంది, కలికోట ఎందుకు పూర్తి చేయలేదు చెప్పాలని అన్నారు. ఆది శ్రీనివాస్ తన కోసం ఏమీ అడుగుతలేదని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనులు అడుగుతున్నాడని, ప్రజల బాగోగుల కోసం పాటుపడుతున్నారని అన్నారు. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలేదని, అయినా సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మెడికల్ కాలేజ్, యార్న డిపో డిపో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆనాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డు పెట్టాలని మా నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారని, తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తరువాత గల్ఫ్ బోర్డు తో పాటు, ఐదు లక్షల ఎక్సిగ్రేషియా అమలు చేస్తున్నామని అన్నారు. ఆనాడు ఏ ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మికుల కోసం ఆలోచన చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అయినా, నాలుగు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కి పోయాయని, రెండు నెలలు సర్దుకోవడానికి టైం పట్టిందని, మిగతా నెలలో పది సంవత్సరాలు కేసీఆర్ చెయ్యని పనులనుమా ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీ ఆర్ఎస్ నాయకుల మైండ్ దొబ్బిందని, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న వచ్చింది, ఇప్పుడేమో మెదడు దొబ్బింది అని అన్నారు. గత పది సంవత్సరాల్లో బీ ఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏమి చేయలేదని, రైతుల సంక్షేమం కోసం చేస్తే ఆ పది సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఎందుకుంటుందని అన్నారు. కెసిఆర్ మాటలు చిల్లర మాటాలని, వాళ్ళ ఏమి మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని, 10 ఏళ్లలో ఏం చేయలేదని, మీరు చేయలేని 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుడు తప్ప, వారికి ఏమీ తెలియదని,స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది బావ బామ్మర్దిలకు కాంగ్రెస్ నాయకుల సత్తా ఏమిటో అని అన్నారు..
పది నెలల్లో 50 ఉద్యోగాలు కల్పించామని, పది సంవత్సరాల్లో కెసిఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పాలని, ఏ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలు 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, దీనిపై ఎల్బీ స్టేడియంలో చర్చిందామని ఎల్బీ స్టేడియానికి కెసిఆర్ రావాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రుణమాఫీ,నిరుఉద్యోగులకు ఉద్యోగ కల్పన, మహాలక్ష్మి, 500 కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని అన్నారు. వరి వేసుకుంటే ఊరి అన్న కేసీఆర్ ఆనాడు ఆయన ఫామ్ హౌస్ లో వరి వేసుకున్నాడని, నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న వడ్డు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్తే,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారని అన్నారు. కెసిఆర్ కట్టిన కాలేశ్వరం సుందిళ్ల మేడిపల్లి కూలిందని, కాలేశ్వరం ప్రాజెక్టు నుండి లిఫ్ట్ చేయకుండానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల తోనే ఈరోజు తెలంగాణలో ఒక కోటి 53 లక్షల వరి ధాన్యం పండిందని అన్ని అన్నారు. వేలకోట్లు ప్రజాధనం వృధా చేసి ప్రాజెక్టులు కట్టాడని, ఎంతవరకు పూర్తి చేశాడో చెప్పాలని అన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేస్తే రైతుల దగ్గర, ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు బదలాయించుకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడని, త్వరలోనే హరీష్ రావు లెక్కలు తీస్తామని అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ నీళ్లు తీసుకుపోయడానికి కొండ పోచమ్మ సాగర్ కట్టుకున్నారని, మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ 111 జు వ్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నారని బామ్మర్ది కో ఫామ్హౌస్,బావకు ఫామ్హౌస్ అని, బామ్మర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరుకుతే కేసు పెట్టరా కేటీఆర్ అని అన్నారు. స్వతంత్రం వచ్చి నుండి కొడంగల్ ఏ నాడు అభివృద్ధికి నోచుకోలేదని, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాజెక్టును కూడా హరీష్ రావు అడ్డుపడుతున్నారనిఅన్నారు. కొడంగల్ ప్రాంతంలో పారిశ్రామిక వాడే ఏర్పాటు చేస్తా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగులస్తాయని పారిశ్రామిక వాడ కోసం భూ సేకరణ చేస్తే,రౌడీలతో అధికారులపై దాడి చేస్తే వాళ్ల మీద కేసులు పెట్టేద్దా, దాడులు చేస్తే కేసులు పెట్టొద్దా, పారిశ్రామిక వాడలు పెట్టేద్దా, భూసేకరణ చెయ్యొద్ద కెసిఆర్ అని అన్నారు. జడ్పిటిసి నుండి సీఎం స్థాయి వరకు ఎదిగినానని భూమి విలువ నాకు తెలుసునని, ఒక్క ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఒకరు నష్టపోక తప్పదని, నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది అని, పారిశ్రామిక వార్డులు ఏర్పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మా ఆలోచనని, అందుకే భూసేకరణ చేపట్టామని దీనికి ప్రజలు సహకరించాలని అన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భూసేకరణ జరగాలని, 80 వేల పుస్తకాలు చదివిన మేధావి కెసిఆర్ ఈ విషయం నీకు తెలవదా అని అన్నారు. నా నియోజకవర్గం కోడంగల్ పై ఎందుకు ఎందుకు కక్ష కట్టిండ్రు, దాడి చేసిన లపై కేసులు పెడితే నా మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ పోవడం అయింది, చంద్రమండలంపై ఫిర్యాదు చేసుకోవాలని, కేటీఆర్ ఎంత ఉరుకుతావ్ ఊరుకు, నీ లెక్కలు త్వరలోనే తీరుస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు సంవత్సరానికి రెండు చీరలు అందజేస్తామని త్వరలోనే చేనేత కార్మికులకు ఆర్డర్ ఇస్తామని, నేత కార్మికులు ఎవరు అధైర్యపడవద్దని అన్నారు.
నెలల్లో రాష్ట్రంలోనే 3 కోట్ల జనాభాకు రేషన్ ద్వారా సన్న బియ్యం
నీటి పారుదల శాఖ మంత్రి , ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతు
000 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు ఒకేసారి ప్రారంభంఅభినందనీయమని,
స్వతంత్ర భారతదేశంలో అత్యధికంగా వరి పంట పండింది తెలంగాణ రాష్ట్రం అని,66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన తెలంగాణ రైతులు అని అన్నారు.
1 0నెలలో 50 వేల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది అని,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని,
శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల కొత్త పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
500 రూపాయల గ్యాస్ సిలిండర్ల సరఫరా, ఆరోగ్య శ్రీ 10 లక్షల పెంపు,గౌరవెల్లి ప్రాజెక్టుకు 400 కోట్లు మంజూరు చేశామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనులు 83% పూర్తయ్యాయి, మరో సంవత్సర కాలంలో 340 కోట్లు ఖర్చు పెట్టి 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నిలు అందిస్తామని అన్నారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు కు 70 కోట్లు ఖర్చు పెట్టాం, మరో 30 కోట్లు ఖర్చు చేసే పూర్తి చేస్తామని,ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజి 2 ఫేస్ 1 పనులు పూర్తి చేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తా మని అన్నారు.ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 లో పెండింగ్ పనులకు 170 కోట్లు ఖర్చు చేసి వేములవాడ నియోజకవర్గం లో 40 వేల 500 ఎకరాలకు, కోరుట్లలో 2500 ఎకరాలకు నూతన ఆయకట్టు సాగునీరు అందిస్తామని అన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై వారం రోజులలో నిర్వహిస్తామని
సిరిసిల్లలో కాళేశ్వరం ప్యాకేజీ 9,10,11 పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని
మరో నెల, 2 నెలల్లో రాష్ట్రంలోనే 3 కోట్ల జనాభాకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని అన్నారు..

త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం..
రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తామని,మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం మన రాష్ట్రంలో ఏర్పడింది అని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలతో పాటు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.గతంలో అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తే, ఈనాడు గుళ్ళు, బళ్ళు, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులకు ప్రజా ప్రభుత్వం మేలు చేస్తున్నాదని అన్నారు.ఎన్నికలలో చెప్పకపోయినా పేదవాడు కష్టం తెలిసిన ప్రభుత్వంకాబట్టి, గురుకుల విద్యార్థులకు 40 శాతం మేర డైట్ చార్జీలు పెంచామని అన్నారు.రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని,అర్హులైన పేదలందరికీ ,రాజకీయాలు, కులాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.మిడ్ మానేరు నిర్వాసితులకు 236 కోట్లతో 4696 ఇండ్ల మంజూరు చేసామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తాం..

బీసి , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజన్న భక్తుల చిరకాలకాంక్ష నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ దేవస్థానం నేడు అభివృద్ధి పథం లో నడుస్తుందని అన్నారు.గతంలో ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరగాలని అనేక పోరాటాలు చేసామని, ఈ ప్రజా ప్రభుత్వంలో మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను ఒక్కటొకటిగా అమలు చేస్తామని అన్నారు.సిరిసిల్ల నేతన్న కార్మికులకు ఉపయోగపడే యార్నీ డిపో ప్రారంభించామని,
రాబోయే రోజుల్లో నేతన్న కార్మికుల ఉపాధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.
పెండింగ్ ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని అన్నారు..

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ధి పై పీసీసీ చీఫ్ గా మాట ఇచ్చి, 10 నెలల సమయంలో కార్యాచరణ రూపొందించి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు.గత ప్రభుత్వం ఏగవేసిన బకాయిలు చెల్లిస్తూనే, 30 సంవత్సరాల చిరకాల కోరిక నూలు డిపో ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.నేతన్న చేయూత, నేతన్న బీమా, పావలా వడ్డీ పథకాలను చేనేత కార్మికులకు అమలు చేస్తున్నామని,365 రోజులు చేనేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుంది అని అన్నారు.ముఖ్యమంత్రి చోరువతో ఐఐహెచ్టీ మంజూరు చేసిందని అన్నారు.రాజన్న దయవల్ల దేశంలోనే అత్యధికంగా వరి పంట దిగుబడి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని,కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయిందని,18 వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశాం, మిగిలిన రుణమాఫీ సోమ్ము త్వరలో విడుదల చేస్తామని,ప్రభుత్వం అందించిన బోనస్ ప్రకటనతో 60 శాతం సన్న రకం ధాన్యం ఉత్పత్తి పెరిగినదని అన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ
60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అని,ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెడ్తున్నామని అన్నారు 66 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం అని 4696 నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లుఅందజేస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
పేదల కోరికలు తీర్చే రాజన్న ఆలయ విస్తరణ పనులకు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు అని,గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వేములవాడలో ఇచ్చిన మాటని విస్మరిస్తే,ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆలయ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని చెప్పిన మాటని నేడు సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నాడని అన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజి 2 ఫేస్ 1 లో మర్రిపెల్లి చెరువు, లచ్చంపేట తండా, రుద్రంగి, కలిగోట, సురంగి ప్రాజెక్టులకు అండగా ఉంటామని ఇచ్చిన మాట, కాళేశ్వరం ప్యాకేజీ 9 లో పేరుకుపోయిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నదని అన్నారు.
1000 కోట్ల పైగా నిధులను వేములవాడ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసింది అని,వేములవాడ అభివృద్ధి కోసం ప్రతి శాఖల మంత్రిలు సంపూర్ణ సహకారం అందించారుఅని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు మిడ్ మానేర్ నిర్వాసితులకు 4969 మందికి రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు అని అన్నారు.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనుల ను శృంగేరి పీఠం సూచనల మేరకు చేపడుతున్నామని,వేములవాడ పట్టణ వాసుల చిరకాల కోరిక రోడ్డు విస్తరణ పనులకు 47 కోట్లతో భూమి పూజ నేడు నిర్వహించుకున్నామని అన్నారు.గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పటికీ నూలు డిపో మంజూరు చేయలేదు, నేడు ప్రజా ప్రభుత్వంలో చేనేత క్లస్టర్ గా ఉన్న వేములవాడ పట్టణంలో 50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేస్తున్నామనిగత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలకు బకాయి పడ్డ 275 కోట్లలో 203 కోట్లు ప్రజా ప్రభుత్వం చెల్లించింది అని అన్నారు.