Breaking News

పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలు

ఎల్లలు దాటిన పోతన పద్యాలు 

ఆరు నెలల్లో పోతన స్మృతి వనాన్ని ప్రారంభిస్తాం 

పాలకుర్తి , బమ్మెర, వల్మిడి గ్రామాలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు 

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి 

పోతన జ్ఞాపకాల కోసం అమెరికాలో యాప్ ఏర్పాటు 

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు 

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి:

బసవ పురాణం గ్రంథకర్త తొలి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు, మహా భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన, రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి జన్మించిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలని,
పోతన రచించిన పద్యాలు ఎల్లలు దాటడంతో బమ్మెర, పాలకుర్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు దక్కిందని టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధ్యక్షతన పోతన స్మృతి వనం, అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న . ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టూరిజం  కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి పోతన సమాధిని, పోతన వ్యవసాయం చేసేందుకు ఉపయోగించిన బావిని, అక్షరాభ్యాస కేంద్రాలను, సరస్వతి ఆలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి లతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోతన పుట్టు పూర్వోత్తరాలను సేకరించిన తీన్మార్ మల్లన్న పోతన మనవాడేనని, ఇక్కడే పుట్టి ఇక్కడే రచనలు చేశాడని తెలంగాణ సమాజానికి తెలియజేయడం అభినందనీయ
మన్నారు. పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ చారిత్రాత్మక ప్రదేశాలని టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. భాగవతాన్ని తెలుగులో అనుభవించిన గొప్ప సహజకవి పోతన అని కొనియాడారు. 700 సంవత్సరాల పోతన పద్యాలను జ్ఞాపకార్థకంగా ప్రజలకు వివరించి వారికి అందుబాటులో ఉండే విధంగా అమెరికాలో అక్కడి తెలుగు ప్రజలు యాప్ ను రూపొందించాలని వివరించారు. అసంపూర్తిగా ఉన్న పోతన పర్యాటక పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని సదుద్దేశంతో ఇటీవలే కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. సందర్శకుల సౌకర్యార్థం హరిత హోటల్ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. పోతన సమాధికి, వ్యవసాయ బావికి సమీపంలో ఉన్న వాగుపై చెక్ డాం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పాలకూరి సోమనాథుడు తొలి తెలుగు కవి అని, ఆయన రచనలను స్ఫూర్తిగా తీసుకొని పోతన సహజకవిగా మారాడని గుర్తు చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆరు నెలల్లో పనులను పూర్తి చేసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పోతన స్మృతి వనాన్ని ప్రారంభించుకుంటామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. పాత కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిర్మాణ పనులను వదిలేసి వెళ్లారని, కొత్త కాంట్రాక్టర్కు అవకాశం కల్పించి పనులు పూర్తయ్యే విధంగా దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో పాపారావు, పాండురంగారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, వివిధ శాఖల అధికారులు, బమ్మెర గ్రామస్తులు పాల్గొన్నారు.