మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామపంచాయతీ లో బుధవారం నిజామాబాద్ జోనల్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో టిబి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రజిత మాట్లాడుతూ.. వ్యాధి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. వ్యాధి సోకినప్పుడు పాటించవలసిన నియమాల పై, అవగాహన కల్పించారు. కండోమ్ అవుట్ లేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, సి ఎల్ డబ్ల్యూ భావాన, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.