Breaking News

రాజ్ భవన్, ప్రజా భవన్, కలెక్టర్ ప్రజావాణి లోఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవా .?

,- ప్రజలు ఎన్నో పిర్యాదులు.. చర్యలు కరువు
,- NH -163 నాలా పక్కన అక్రమ నిర్మాణం చేసిన తాజా మాజీ సర్పంచ్

  • నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 కు విరుద్ధం అని తేల్చిన అధికారులు
  • జిల్లా అధికారులు ఎందుకు ఇప్పటికి చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్న ప్రజలు
  • అధికారులు భాద్యతగా చర్యలు తీసుకోవాలని డిమాండ్

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

గత BRS పాలనలో జనగామ జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు, రఘునాథపల్లి తాజా మాజీ సర్పంచ్ పోకల శివకుమార్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చి ఒక సంవత్సరం గడువక ముందే కోటి మింగిన సర్పంచ్, పల్లె ప్రగతికి తూట్లు .. అని ప్రధాన శీర్షికలతో పత్రికలు వ్రాసే విధంగా పాలన అందించినాడు.ప్రజలు ఎన్నో పిర్యాదులు చేసిన ఇప్పటికి ప్రజల సొమ్ము రికవరీ అధికారులు చేయలేదు..

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం


అదే కాకుండా రఘునాథపల్లి గ్రామ చెరువు అయిన శనిగ చెరువు కింది భాగంలో NH వారు NH-163 సర్వీస్ రోడ్డు లో బ్రిడ్జి నిర్మాణం చేసి ఉన్నారు.. దాని పక్కన ప్రభుత్వ నిషేధిత భూమి సర్వే నెంబర్ -352/అ లో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సర్పంచ్ అయివుంది ప్రభుత్వ భూమి ని కాపాడాలి అనే సోయి లేకుండా జి. ఓ ఎం. స్ – 67 ను ఉల్లంగించి 3అంతస్తుల అక్రమ భవనం నిర్మించడం చేసినాడు.. ప్రజలు పిర్యాదు లు చేసి విచారణ చేయమని కలెక్టర్ ను కోరగా అది అక్రమ నిర్మాణం అని జిల్లా పంచాయతీ అధికారులు తేల్చి చెప్పి నివేదికను సమాచార హక్కు చట్టం -2005 ప్రకారంగా ఇవ్వడం జరిగింది.. కాని ఇప్పటికి అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోలేదు. ప్రజలు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ కు, ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి కి మరియు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణి లో పిర్యాదులు చేస్తూనే ఉన్నారు..
గత 3 సంవత్సరాలనుండి ఎన్నో పిర్యాదులు చేసిన అక్రమ నిర్మాణం పైన ఎందుకు భాద్యతగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.BRS నుండి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లోకి మారడం వల్లనే అక్రమ నిర్మాణం గురించి చర్యలు ఉండడం లేదని ప్రజలు భహిరంగంగా మాట్లాడు కుంటున్నారు..
ఇప్పటికి అయిన సంభంధిత జిల్లా అధికారులు సర్పంచ్ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలని, మింగిన ప్రజల సొమ్ము రికవరీ చేయాలని ప్రజా పాలన ప్రభుత్వంను గ్రామ ప్రజలు కోరుతున్నారు.