ఇంటి అనుమతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే కెపి వివేకానంద్
మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల రామారం సర్కిల్ కార్యాలయంలో గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మెల్యే కెపి వివేకానంద్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాజులరామారం డివిజన్ పరిధిలో ఇంటి నిర్మాణాల అనుమతుల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నియమ, నిబంధనలను పాటించకుండా వక్ఫ్, దేవాదాయ శాఖల పేరు చెప్పి అనుమతులు ఇవ్వకుండా దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, కోర్టు ఉత్తర్వులను పాటించకుండా, చేద్దాంలే.. చూద్దాంలే అనే ధోరణి వహించకుండా, దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే అనుమతులను ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, ఏసిపి రమేష్, టిపిఎస్ తుల్జా సింగ్, హెచ్ఐఎల్ కాలనీవాసులు అడ్వకేట్ కమలాకర్, చిన్న చౌదరి, అంజయ్య, వీరయ్య చౌదరి, తాహేద్, శ్రీనివాస్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.