మన ప్రతి న్యూస్ /నల్లబెల్లి
మండలంలోని నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చికుముకి సైన్స్ సంబరాలు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.భవిష్యత్ శాస్త్రవేత్తలు అయిన చిన్నారి విద్యార్థిని విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి వారిలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలిగితీయడానికి శాస్త్రీయ ఆలోచనలు మరియు పరిశీలనా శక్తిని, పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా ఈనెల 7వ తేదీన నిర్వహించిన పాఠశాల స్థాయి సైన్స్ టాలెంట్ పరీక్షలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల కు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లబెల్లి ఆవరణలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం జరిగింది. నల్లబెల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఏ పద్మజ ప్రశ్నపత్రాలను సీల్ ఓపెన్ చేసి పరీక్షను ప్రారంభించడం జరిగింది.అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై మండల స్థాయి పరీక్ష లో మొదటి స్థానంలో నిలిచి జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ పరీక్షకు ఎన్నికైన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది.
జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎన్నికైన విద్యార్థుల వివరాలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగాపురం కు చెందిన ఎస్ విశాల్, యం యశ్వంత్ మరియు ఎండి అనిఫ్
కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం నల్లబెల్లి పాఠశాలకు చెందిన కే నవ్య శ్రీ, ఎస్ నవ్య శ్రీ మరియు పి హర్షిత.
కేబీఎస్ హైస్కూల్ రుద్రగూడెం కు చెందిన బి చరణ్, పి సుచన్ మరియు జి సంహితలు జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఎన్నికవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చెకుముకి సైన్స్ సంబరాల నల్లబెల్లి మండల కన్వీనర్ శ్రీరామ సంతోష్ కుమార్ , ఉపాధ్యాయులు కుమారస్వామి , అన్నదేవి, బుచ్చన్న, శోభారాణి, జ్యోతి, హాము వసీం సుల్తానా, డాక్టర్ శంకరయ్య మరియు వివిధ పాఠశాలల నుంచి వచ్చిన గైడ్ టీచర్లు పాల్గొన్నారు.