మన ప్రగతి న్యూస్/ బయ్యారం:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతు మహా ధర్నా అనుమతి నిరాకరించి పక్షపాతంగా వ్యవహరించిన పోలీసుల తీరును నిరసిస్తూ ,అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల మాటలను ఖండిస్తూ బయ్యారం మండల కేంద్రంలో భారాస పార్టీ మండల నాయకులు ఏనుగుల ఐలయ్య మాట్లాడుతూ లగచర్లలో రైతుల అరెస్ట్ కు, దాడికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టిన మాహధర్నాకు అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలుచేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, మండల నాయకులు జరుపుల శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ జగన్, రేఖ యాకయ్య, వీరబాబు, దేవోజీ, లచ్చిరాం, తదితరులు పాల్గొన్నారు.