Breaking News

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం హరితహారం మొక్కలు ఎండిపోయిన వైనం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో హరితహారం పథకం కింద తీసుకొచ్చినటువంటి వేల మొక్కలు ద్వారాకాపేట లోని ఫిల్టర్ బెడ్ వద్ద ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండడంతో ఇది తెలిసిన నర్సంపేట భాజపా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కంబంపాటి పుల్లారావు పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నర్సంపేట మున్సిపాలిటీ అధికారి శ్రీధర్ పర్యవేక్షణలో ఉన్నటువంటి మొక్కలు వేల సంఖ్యలలో ఎండిపోవడం,అధికారుల పర్యవేక్షణకు పరాకాష్ట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరితహారం పథకంలో కోట్లల్లో ఖర్చుపెట్టి ప్రజలకు అందివ్వాలని ,మొక్కలు ప్రకృతిలో ఒక భాగం అని మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మంచి జరగడం పాటు మానవ జీవన విధానానికి తోడ్పడుతుందని, హరితహారం కింద పంపిణీ చేయాల్సిన మొక్కలను పర్యవేక్షించక ఎండబెట్టడం అధికారులకే చెల్లింది.అడవులు పచ్చదనంతో చేయాలని సంకల్పించి ఏర్పాటుచేసిన ఈ హరితహారం పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది వెంటనే మొక్కలను ప్రజలకు అందివ్వాలని అన్నారు.అన్నీ నేనే నేను చేయాలి, అన్ని పనులలో వేలు పెట్టి మున్సిపాలిటీలో శ్రీధర్ పర్యవేక్షించడం లోపంతో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలే నీరు పెట్టేవారు లేక ఎండిపోవడానికి కారణమైన అధికారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాల్నే జగన్, ఎస్సీ మోర్చా నాయకుడు కూనమళ్ళ పృథ్వీరాజ్, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి పంజాల రాము, జిల్లా ఎస్టీ మోర్చా నాయకులు బానోత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.