Breaking News

భారత్‌లో 10కి చేరనున్న ‘ట్రంప్’ టవర్స్ – హైదరాబాద్‌లో కూడా ట్రంప్ స్కై స్క్రేపర్స్

హైదరాబాద్, నోయిడా, బెంగళూరు సహా ఆరు నగరాల్లో లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటికే ఉన్న నాలుగు టవర్లకు అదనంగా, ట్రంప్ సంస్థ హైదరాబాద్, నోయిడా, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణె నగరాల్లో అత్యాధునిక ‘ట్రంప్ టవర్స్’ ప్రాజెక్టులను ప్రారంభించనుంది. ఈ కొత్త నిర్మాణాలతో భారత్‌లో మొత్తం ట్రంప్ టవర్ల సంఖ్య 10కు చేరుకోనుంది, ఇది అమెరికా వెలుపల అత్యధికంగా ట్రంప్ టవర్లు ఉన్న దేశంగా భారత్‌ను నిలిపే అవకాశం ఉంది.

ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల్లో ఆరు ప్రాజెక్టులు

ట్రంప్ టవర్ల నిర్మాణ బాధ్యతను ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి చేపడుతోంది. మొత్తం ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ.15,000 కోట్లకు పైమాటే. ప్రస్తుతం ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్, పుణే నగరాల్లో ట్రంప్ టవర్లు ఉన్నప్పటికీ, తాజా ప్రాజెక్టులతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

సొగసైన నివాసాలు, విలాసవంతమైన వాణిజ్య సముదాయాలు

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

ట్రంప్ టవర్లలో అధునాతన సౌకర్యాలు కలిగిన నివాసాలు, వాణిజ్య సముదాయాలు ఉంటాయని ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మెహతా తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోల్ఫ్ కోర్సులు, విల్లాలు, లగ్జరీ ఆఫీసులు కూడా నిర్మించనున్నారు. ప్రతి ప్రాజెక్టులో స్థానిక డెవలపర్లు, భూ యజమానులు భాగస్వాములుగా ఉంటారు. ఈ టవర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్‌లలో ప్రధానంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

2025లో ప్రారంభం – ట్రంప్ జూనియర్ పాల్గొనవచ్చు

నాలుగు ప్రాజెక్టులను డిసెంబరులో అధికారికంగా ప్రకటించనున్నారు, వీటిని 2025లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముంబయి, పుణె, గురుగ్రామ్, కోల్‌కతా తదితర నగరాల్లో ఉన్న ట్రంప్ టవర్స్ ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించాయి.